బరిలో శ్రీకాంత్..నేటి నుంచి వరల్డ్ 6 -రెడ్ స్నూకర్ చాంపియన్‌‌షిప్‌‌

బరిలో శ్రీకాంత్..నేటి నుంచి వరల్డ్ 6 -రెడ్  స్నూకర్ చాంపియన్‌‌షిప్‌‌

మనామా (బహ్రెయిన్): స్టార్ క్యూయిస్ట్, మూడుసార్లు చాంపియన్‌‌గా నిలిచిన పంకజ్ అద్వానీ నేతృత్వంలోని ఇండియా వరల్డ్ 6- రెడ్ స్నూకర్ చాంపియన్‌‌షిప్‌‌కు రెడీ అయింది. గత నెల కొలంబోలో జరిగిన ఆసియా టీమ్ స్నూకర్ టోర్నమెంట్‌‌లో జట్టును గెలిపించిన పంకజ్‌‌కు, బ్రిజేష్ దమాని, ఆదిత్య మెహతాలతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. ఆసియా  విజయంతో వచ్చిన ఉత్సాహాన్ని వరల్డ్ చాంపియన్‌‌షిప్‌‌లోనూ కొనసాగించాలని పంకజ్‌‌ చూస్తున్నాడు. మరోవైపు ఈ టోర్నీ అండర్‌‌–‌‌21 విభాగంలో తెలంగాణ కుర్రాడు గద్ద శ్రీకాంత్ బరిలో నిలిచాడు. హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన 18 ఏండ్ల శ్రీకాంత్ ఈ టోర్నీలో సత్తా చాటి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాడు.