
హైదరాబాద్, వెలుగు: దేశంలో అడ్వకేట్ల రక్షణ చట్టం కీలకమైందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లీగల్ సెల్ సమావేశం జరిగింది. దీనికి చీఫ్ గెస్టుగా అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అటెండ్ అయ్యారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రీమియం ఇవ్వడం లేదన్నారు. అలాంటి కేసులు కూడా సుప్రీం కోర్టులో ఉన్నాయని గుర్తుచేశారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మూడేండ్లు చాలా కీలకమన్నారు. ప్రతి శాఖ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ... న్యాయవాదులకు భద్రత కల్పించే చట్టాలు రావాలని కోరారు. సమావేశంలో ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.