బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయడంపై తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కృష్ణ, కన్వీనర్ రాజేశ్మాట్లాడుతూ.. న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కోరారు.
ప్రతి జిల్లాలో అర్హులైన అడ్వకేట్లకు ఇంటి స్థలం కేటాయించాలన్నారు. యువ న్యాయవాదులకు వృత్తి రీత్యా కావాల్సిన మౌలిక సదుపాయాలకు రూ.50 వేల ప్రోత్సాహకం ఇవ్వాలని పేర్కొన్నారు. కోకన్వీనర్ విజయ్ సురేశ్, వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
