లంచం తీస్కుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

లంచం తీస్కుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

కామారెడ్డి, వెలుగు: లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ట్రాన్స్​కో ఏఈ ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్​ రేంజ్ ​ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ​తెలిపిన వివరాల ప్రకారం.. భైరవ స్వామి అనే కాంట్రాక్టర్​తన రెండు డీసీఎం వెహికల్స్ ను ట్రాన్స్ కో సంస్థలో అద్దెకు పెట్టాడు. ఒక్కో వెహికల్​నెల కిరాయి రూ.61 వేలు. అయితే వాటి రెండు నెలల బిల్లులు రిలీజ్​చేయాలంటే రూ.12,500 లంచం ఇవ్వాలని ట్రాన్స్​కో 132 కేవీ లైన్ కామారెడ్డి ఏఈ సాయానీ రాజు డిమాండ్​చేశాడు.

ఇస్తానని ఒప్పుకున్న భైరవస్వామి ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం భైరవస్వామి ఏఈ రాజుకు ఫోన్ చేయగా, కామారెడ్డి బస్టాండ్​సమీపంలోని ఎవర్​గ్రీన్​జిరాక్స్​సెంటర్​ఓనర్ సంతోశ్​కు డబ్బు ఇవ్వాలని సూచించాడు. డబ్బు ఇస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఏఈ రాజును అరెస్ట్ ​చేసినట్లు డీఎస్పీ తెలిపారు.