వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఏఈవో సూసైడ్‌‌‌‌.. నల్గొండ జిల్లా ఉరుమడ్లలో ఘటన

వడ్డీ వ్యాపారుల వేధింపులతో  ఏఈవో సూసైడ్‌‌‌‌.. నల్గొండ జిల్లా ఉరుమడ్లలో ఘటన

చిట్యాల, వెలుగు : వడ్డీ వ్యాపారులు, చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఓ అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉరుమడ్ల గ్రామానికి చెందిన గుంటోజు బాలరాజు (38) కేతేపల్లి మండలంలో అసిస్టెంట్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. తన సొంత అవసరాల కోసం కొన్ని రోజుల కింద ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులతో పాటు చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ కంపెనీ వల్ల  కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. 

ఈ క్రమంలో బాలరాజుతో ముందస్తుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. తీసుకున్న డబ్బులు తిరిగి కట్టాలని వడ్డీ వ్యాపారులు, చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ ఏజెంట్లు కొంతకాలంగా బాలరాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో వారి వేధింపులు తట్టుకోలేక బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి చూసే సరికే చనిపోయి కనిపించాడు.