మిలటరీ విమానంలో అఫ్గాన్ మహిళ ప్రసవం

V6 Velugu Posted on Aug 23, 2021


బెర్లిన్: యూఎస్ మిలటరీ విమానంలో అఫ్గానిస్తాన్ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని అధికారులు తెలిపారు. అఫ్గాన్​ను తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత ఎంతో మంది రెఫ్యూజీలు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్​కు చెందిన నిండు గర్భిణి యూఎస్ ఎయిర్​ ఫోర్స్ సీ–17 విమానం ఎక్కింది. కాబూల్ నుంచి జర్మనీ వెళ్తుండగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వాతావరణ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో పైలట్ విమానం ఎత్తును తగ్గించి బ్యాలెన్స్ చేశారు. జర్మనీలోని ర్యామ్​స్టెయిన్ ఎయిర్ బేస్​లో ఫ్లైట్​ను ల్యాండ్ చేయగానే డాక్టర్లు వచ్చి ఆమెకు పురుడు పోశారు. ఈ విషయాన్ని మిలటరీ ఎయిర్ బేస్ కమాండ్​ ట్విట్టర్​లో తెలిపింది. తల్లీబిడ్డలను దగ్గరలోని ఆస్పత్రిలో చేర్పించామని, ఇద్దరూ సేఫ్ గా ఉన్నారని తెలిపింది.

Tagged Afghan baby born, US military aircraft, Germany

Latest Videos

Subscribe Now

More News