తాలిబన్ల పిలుపుతో విధుల్లోకి ఆఫ్ఘన్ పోలీసులు

తాలిబన్ల పిలుపుతో విధుల్లోకి ఆఫ్ఘన్ పోలీసులు

ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల వ‌శ‌మైంది. దీంతో కొన్ని రోజులుగా ఆ దేశంలోని పోలీసులు విధుల‌కు దూరం ఉంటున్నారు. అయితే.. తాలిబ‌న్ల పిలుపుతో  పోలీసులు మ‌ళ్లీ విధుల్లో చేరారు. ప‌లు ప్రాంతాల్లో ఆఫ్ఘ‌న్ పోలీసులు విధులు నిర్వ‌హిస్తున్నారు. 

తాలిబ‌న్ క‌మాండ‌ర్ల‌ పిలుపుతో మ‌ళ్లీ విధుల్లో చేరారు ఆఫ్ఘన్ పోలీసులు. తాలిబ‌న్ క‌మాండ‌ర్లు త‌మ‌కు ఫోన్ చేశార‌ని, విధుల్లోకి రావాల‌ని చెప్పారన్నారు వివ‌రించారు. ఈ క్రమంలో తిరిగి తాము మ‌ళ్లీ విధుల్లో చేరడం  సంతోషంగా ఉంద‌ని తెలిపారు. ప్రస్తుతం మ‌ళ్లీ ఎయిర్ పోర్టుల్లోని  ప్ర‌ధాన భ‌వ‌నాలతో పాటు చెక్ పాయింట్ల దగ్గర  పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.