Asia Cup 2025: ఆసియా కప్‌కు ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ ప్రకటన.. కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. నవీన్-ఉల్-హక్‌కు ఛాన్స్

Asia Cup 2025: ఆసియా కప్‌కు ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ ప్రకటన.. కెప్టెన్‌గా రషీద్ ఖాన్..  నవీన్-ఉల్-హక్‌కు ఛాన్స్

ఆసియా కప్ 2025కు ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ ను ప్రకటించారు. 17 మందితో కూడిన స్క్వాడ్ ను ఆదివారం (ఆగస్టు 24) ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ కు జట్టులో స్థానం దక్కింది.17 మంది సభ్యుల జట్టులో ఎవరైనా గాయపడితే, సెలెక్టర్లు ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. స్టాండ్‌బైస్‌లో వఫివుల్లా తారఖిల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్‌జాయ్ ఎంపికయ్యారు. 

ఆఫ్ఘనిస్తాన్ ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. వారి చివరి సిరీస్ డిసెంబర్ 2024లో జింబాబ్వేపై ఆడింది. జింబాబ్వేతో ఆడిన జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే తొలగించారు. జింబాబ్వే పర్యటనకు దూరమైన హజ్రతుల్లా జజాయ్, జుబైద్ అక్బరిలు జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ షెడ్యూల్ విషయానికొస్తే సెప్టెంబర్ 9న జరిగే ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్‌తో తలపడుతుంది. ఇదే గ్రూప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక కూడా ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి రెండు జట్లు మాత్రమే సూపర్ 4 కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ బి లో ఎవరు ముందుకు వెళ్తారో ఆసక్తికరంగా మారింది. 

Also read:- ముగ్గురు సెంచరీల మోత.. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా విశ్వరూపం

ఆసియా కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్.. యుఎఇ, పాకిస్తాన్‌లతో జరిగే ట్రై-సిరీస్‌ ఆడుతుంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 29 నుండి ప్రారంభమవుతుంది. ట్రై-సిరీస్‌లోని అన్ని మ్యాచ్ లు షార్జాలో జరుగుతాయి. ఈ సిరీస్ ఆసియా కప్ కు ముందు మూడు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. 


ఆసియా కప్ 2025కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు:

రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్వీష్ రసూలీ, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అల్లాహ్ అష్రాఫ్, ముహమ్మద్ జిబ్హా అష్రాఫ్, ముహమ్మద్ జిబ్హా అష్రాఫ్ నూర్ అహ్మద్, ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ.

రిజర్వ్ ప్లేయర్లు - వఫివుల్లా తారఖిల్, నంగ్యాల్ ఖరోటే, అబ్దుల్లా అహ్మద్జాయ్