
కివీస్ జరుగుతున్న కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన అఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీఫైనల్ అవకాశాలను కష్టతరం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ఓ అద్భుతాన్ని ఆశిస్తోంది. ఆ అద్భుతం అఫ్గానిస్థాన్ టీమ్ చేయాలని, తమను సెమీస్‌కు చేర్చాలని చూస్తోంది. ఒకవేళ ఆదివారం కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో అఫ్గాన్ నెగ్గితే భారత్‌కు సెమీస్ దారి క్లియర్ అవుతుంది. సోమవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే కోహ్లీసేన నాకౌట్ చేరుకుంటుంది. కాబట్టి కోట్లాది మంది భారతీయ అభిమానులు అఫ్గాన్ గెలవాలని కోరుకుంటున్నారు.