బిర్యానీ ఆరోగ్యానికి మంచిది

బిర్యానీ ఆరోగ్యానికి మంచిది

హైదరాబాదీ బిర్యానీ అంటే దేశమంతా ఫేమస్. రుచికోసమే కాదు..హైదరాబాద్ బిర్యానీ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అఫ్రికన్ జర్నల్ ఆప్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటోంది. దీనికి సంబంధించి ఓ జర్నల్ను కూడా ఇచ్చింది. బిర్యానీలో కూరగాయలు, గుడ్డు, మాంసంతో పాటు..అనేక రకాల పదార్థాలు ఉన్నందున రుచితో పాటు..అధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని జర్నల్  తెలిపింది. 

బిర్యానీ పేరు వినగానే చాలా మందికి హైదరాబాద్ ధమ్ బిర్యానీనే గుర్తుకు వస్తుంది. ఏ రెస్టారెంట్కు వెళ్లినా..కాస్ట్లీ హోటల్కు వెళ్లినా..అక్కడ మెయిన్ కోర్సుగా బిర్యానీనే ఉంటుంది. బిర్యానీ లవర్సే కాదు..వరల్డ్ వైడ్గా ఉన్న ఫుడ్ లవర్స్ కూడా ది బెస్ట్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అంటూ కితాబిస్తారు. అలాంటి బిర్యానీలో రుచితో పాటు...ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుండటం సంతోషంగా ఉందని బిర్యానీ లవర్స్ అంటున్నారు. 

హైదరాబాద్ బిర్యానీలో యాంటీ యాక్సిడెంట్లు ఉండే మసాలాలతో చాలా ఉపయోగం అంటోంది ఆఫ్రికన్ జర్నల్. బిర్యానీ తయారీలో ఉపయోగించే నల్ల మిరియాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. సల్ఫ్యూరిక్ సమ్మేళనాలు మాంగనీస్, విటమిన్ B6, విటమిన్ C మొదలైనవి..పుష్కలంగా ఉంటాయి కనుక..శరీరానికి తగినంత విటమిన్లు అందుతాయి. బిర్యానీలోని మసాలా దినుసులు కాలెయ యాంటీ యాక్సిండెట్లుగా పిలవబడే గ్లూటాతియోన్ను ఉత్పత్తి చేస్తాయి. హైదరాబాద్ బిర్యానీలో ఉపయోగించే కుంకుమ పువ్వు..కాలెయ ఎంజైమ్లను పెంచి..శరీరాన్ని  డీ టాక్సిఫై చేస్తుందని ఆఫ్రికన్ జర్నల్ పేర్కొంది. 

నిజంగానే బిర్యానీ తన దమ్ము చూపిస్తోంది. 2022లో ఏకంగా నిమిషానికి 132 ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి.  అంతకుముందు ఏడాది స్విగ్గీ రిపోర్టు ప్రకారం 2021లో నిమిషానికి 115 ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. అంటే ఏ స్థాయిలో బిర్యానీ అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం స్విగ్గీలాంటి లెక్కలే ఇలా ఉంటే జొమాటో వంటి వాటిల్లో ఇంకా ఏ మేరకు అమ్ముడవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 

ప్రపంచ వ్యాప్తంగా 80 రకాల బిర్యానీలు ఉన్నా..భాగ్యనగరం ధమ్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరే లెవల్. అందుకే హైదరాబాద్కు ఏ సెలబ్రిటీ వచ్చినా..బిర్యానీని టేస్ట్ చేయకుండా ట్రిప్ కంప్లీట్ చేయరు.