
'ప్రేమికులు' చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ కామ్నా జెఠ్మలానీకి గోపీచంద్ హీరోగా వచ్చిన 'రణం'తో సూపర్ హిట్ దక్కింది. తన యాక్టింగ్తో మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సామాన్యుడు, టాస్, అందమైన అబద్దం, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కత్తి కాంతారావు, యాక్షన్, శ్రీ జగద్గురు ఆది శంకర తదితర చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించింది. అయితే పెండ్లి, పిల్లలు తర్వాత కామ్నా జెఠ్మలానీ.. కెరీర్కు బ్రేక్ ఇచ్చింది.
చివరగా 2015లో తెలుగు కన్నడ ద్విభాషా సినిమా 'చంద్రిక'లో కనిపించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క మూవీలో కూడా యాక్ట్ చేయలేదు. పదేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వెండితెరకు రీ ఎంట్రీకి ఇవ్వనుంది. తాజాగా యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కే ర్యాంప్ చిత్రంలో కామ్నా జెఠ్మలానీ యాక్ట్ చేసింది. కే ర్యాంప్ సినిమా దీపావళి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఆ సినిమాలో యుక్తి తరేణా హీరోయిన్. జైన్స్ నాని దర్శకత్వం వహించిన KRamp చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేశ్ దండ శివ బొమ్మక నిర్మిస్తున్నారు.