60 ఏళ్ల తర్వాత రంగు మార్చిన స్ప్రయిట్

60 ఏళ్ల తర్వాత రంగు మార్చిన స్ప్రయిట్

అత్యంత ఫేమస్ అయిన కూల్ డ్రింకుల్లో ఒకటైన స్ప్రయిట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోడా తరహాలో డైజేషన్ లాంటి సమస్యలకు కొంత మంది దీన్ని వాడుతూ ఉంటారు. అయితే దీని బాటిల్ కలర్ మూమూలుగా గ్రీన్ (ఆకుపచ్చ) కలర్ లో ఉంటుంది. ఇది నిన్నటి వరకూ ఉన్న మాట. ఇక తాజా వార్త ఏంటంటే.. స్ప్రయిట్ తన లుక్ ను మార్చుకొని... కొత్త స్టైల్లో మార్కెట్ లోకి రాబోతుంది. ఇప్పటి వరకూ ఆకుపచ్చ రంగులో ఉన్న బాటిల్ కలర్ ను... నిర్వాహకులు వైట్ కలర్ గా మార్చారు. పర్యావరణ హితం కోసమే ఈ పని చేశామని కంపెనీ ప్రతినిధులు చెప్తు్న్నారు.

60ఏళ్ల తర్వాత తొలిసారిగా స్ప్రయిట్ తన లుక్ ను మార్చుకుందని ఆ కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ కొత్త బాటిల్ డిజైన్ ను (ఆగష్టు 1) ఈ రోజు నుంచి అమల్లోకి తేనుంది. రంగుల్లేని ప్లాస్టిక్ ఉపయోగించాలని తాము నిర్ణయించుకోవడం కారణంగానే ఈ రోజు బాటిల్ రంగును మార్చామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ న్యూ లుక్ ను అమెరికాలో మార్చినట్టు కోకాకోలా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దశల వారిగా అన్ని దేశాల్లోనూ దీన్ని అమలుచేస్తామని కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది.