చాలా గ్యాప్ తర్వాత రాజ్భవన్ కు వెళ్లిన కేసీఆర్

చాలా గ్యాప్ తర్వాత రాజ్భవన్ కు వెళ్లిన కేసీఆర్

సుమారు 9 నెలల తర్వాత రాజ్భవన్ కు వెళ్లారు సీఎం కేసీఆర్. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అయితే గత కొంత కాలంగా గవర్నర్ వర్సెస్ సీఎం అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. దీంతో రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్నారు. చివరి సారిగా గతేడాది అక్టోబరు 11న రాజ్భవన్కు వెళ్లారు కేసీఆర్. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  సతీశ్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొన్నారు.

గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఫైల్ ను తమిళసై రిజెక్ట్ చేసినప్పటి నుండి ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు సైతం గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించారు. గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఉన్నతాధికారులు ఎవరూ హాజరు కాలేదు. ఇక సర్కార్ తీరుపై గవర్నర్ తమిళసై పలుసార్లు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మంత్రులు,నేతలు బహిరంగంగానే గవర్నర్ ను విమర్శించారు.ఇక గవర్నర్ ప్రజాసమస్యలపై ప్రజాదర్బార్ నిర్వహిస్తుండడం కూడా టీఆర్ఎస్ నేతలకు రుచించడం లేదు.