ఆఫ్టర్​ 9 పబ్ ​సీజ్..మరో 29 కేసుల్లో 32 మంది అరెస్ట్​

ఆఫ్టర్​ 9 పబ్ ​సీజ్..మరో 29  కేసుల్లో 32 మంది అరెస్ట్​

పంజాగుట్ట​,వెలుగు : రూల్స్ బ్రేక్ చేసిన ఆఫ్టర్​9 పబ్​ను​ఎక్సైజ్​ పోలీసులు సీజ్ చేశారు. మరో 32 మందిని అరెస్ట్​ చేసినట్లు అమీర్​పేట్​ ఎక్సైజ్​ ఇన్​స్పెక్టర్​ పటేల్​బానోత్​ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తనిఖీలు చేయగా 29 కేసుల్లో 505 లీటర్ల మద్యం,(63.7)లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకుని 32 మందిని అరెస్ట్​ చేసినట్టు తెలిపారు.

మరో 20 మందిని బైండోవర్​ చేశామని చెప్పారు. హైదరాబాద్​ కలెక్టర్​ఆదేశాల మేరకు.. ఆదివారం సాయంత్రం  5 గంటలనుంచి సోమవారం సాయంత్రం పోలింగ్​ముగిసేవరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని సూచించారు.