చాలా రోజుల తరువాత రాత్రి హాయిగా నిద్రపోయా : కేటీఆర్

చాలా రోజుల తరువాత రాత్రి హాయిగా  నిద్రపోయా  :  కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు.  దాదాపు  50 రోజుల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి, నిన్న పోలింగ్ పూర్తైన తరువాత ప్రశాంతంగా నిద్రపోయానని ట్వీట్ చేశారు.  ఎగ్జిట్ పోల్స్ కాస్త పెరగొచ్చు..  కానీ ఎగ్జాట్ పోల్స్ మాకు శుభవార్తన్ని ఇస్తాయి  అని కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు.  ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని కేటీఆర్ పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తు్ంది.  

ఎగ్జిట్​పోల్స్​తో కార్యకర్తలు అయోమయానికి గురికావొద్దని, 70 సీట్లలో బీఆర్​ఎస్​ పార్టీనే గెలుస్తుందని మంత్రి కేటీఆర్ నిన్న ​అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ముగిసిన అనంతరం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎగ్జిట్​పోల్స్​తో సంబంధం లేకుండా గెలుస్తామన్న ధీమా ఉందని అన్నారు. 2018లో ఒక్క ఏజెన్సీ మినహా మిగతావన్నీ తప్పుడు ఫలితాలు ఇచ్చాయని విమర్శించారు. 

ఎగ్జిట్​పోల్స్​తప్పు అని నిరూపించడం తమ పార్టీకి కొత్త కాదన్న  కేటీఆర్​ ..  అసలైన ఫలితం డిసెంబర్​ 3న వస్తుందని, మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.  ఆగస్టు 21న బీఆర్ఎస్​అభ్యర్థులను ప్రకటించిన రోజు నుంచి పార్టీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.