అసెంబ్లీ తర్వాతే అపెక్స్.!

అసెంబ్లీ తర్వాతే అపెక్స్.!
  • రెండోసారి కూడా మీటింగ్‌ వాయిదా
  • కేంద్ర మంత్రికి కరోనా రావడమే కారణం
  • సెప్టెంబర్‌‌ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • అవి పూర్తయ్యాకే పెట్టాలని కోరే యోచనలో రాష్ట్రం

తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ మళ్లీ వాయిదా  పడింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు కరోనా రావడంతో మంగళవారం(ఈ నెల 25న) నిర్వహించాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు జలశక్తి శాఖ అండర్‌ సెక్రటరీ ఏసీ మల్లిక్‌‌ ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ చైర్మన్లకు ఆదివారం వేర్వేరుగా లేఖలు రాశారు. తిరిగి మీటింగ్‌ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.

 కేంద్ర మంత్రికి కరోనా రావడంతో..

కేంద్ర మంత్రి షెకావత్‌కు ఈ నెల 20న కరోనా పాజిటివ్‌ రావడంతో ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. సెప్టెంబర్‌ 3,4 తేదీలతో ఆయనక్వారంటైన్‌ పీరియడ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఆ వెంటనే అపెక్స్‌ మీటింగ్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రిపరేషన్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వాయిదా కోరే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 7 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండే జరిగే అవకాశం ఉంది. అవి కంప్లీట్‌ అయ్యే వరకు అపెక్స్‌ మీటింగ్ ను వాయిదా వేయాలని కోరే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే తదుపరి కమ్యూనికేషన్‌ను బట్టి రెస్పాన్స్‌ ఇచ్చేందుకు రెడీగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది.

కేసీఆర్‌ అందుబాటులో లేక తొలిసారి వాయిదా

శ్రీశైలం ఫోర్‌షోర్‌లో సంగమేశ్వరం(రాయల సీమ) లిఫ్ట్‌ స్కీం తలపెట్టడంతోపాటు పోతిరెడ్డిపాడుహెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని 80వేల క్యూసెక్కు లకు పెంచేందుకు అనుమతినిస్తూ ఏపీ సర్కారు మే 5న 203 జీవో ఇవ్వడంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది.ఈ ప్రాజెక్టులను ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కరీంనగర్‌ ఎంపీ సంజయ్‌ కేంద్ర మంత్రికి కంప్లైంట్‌ చేశారు. ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని ఆదేశించాలని కేంద్ర మంత్రి కేఆర్‌ఎంబీకి సూచించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై చర్చిస్తామని ప్రకటించారు. ఆగస్టు 5నే మీటింగ్‌ పెడతామని కేంద్రం రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే సీఎం కేసీఆర్ తనకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరారు. కేసీఆర్‌ అందుబాటులో లేకనే అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్ను వాయిదా వేస్తున్నట్టు గా కేంద్రం ప్రకటించింది.

అపెక్స్‌ కౌన్సిల్‌పై రెండు రోజులు రివ్యూ

అపెక్స్‌ మీటింగ్‌కు వెళ్లడంపై మొదట్లో ఆసక్తి చూపని సీఎం కేసీఆర్‌ ఆ తర్వాత వైఖరి మార్చు కున్నారు. వరుసగా రెండు రోజులు అధికారు లు, ఇంజనీర్లతో సమీక్షలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్రం రాసిన లేఖలపై చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ ప్రాజెక్టులను తలపెట్టామని చెప్పే ఆధారాలన్నీ సిద్ధం చేయించారు. ఏపీ కంప్లయింట్లపై దీటైన జవాబు చెప్పడానికి రెడీ అయ్యారు. జల వివాదాలపై కేంద్రం ఎలాంటి వైఖరి అనుసరిస్తే రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందో కూడా చెప్పాలని అనుకున్నారు. తీరా కేంద్ర మంత్రికి కరోనా రావడంతో మూడోరోజు రివ్యూను క్యాన్సి ల్‌ చేశారు.

నెల తర్వాతే అపెక్స్‌ నిర్వహణ

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది. 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తున్నా వారం, పది రోజుల పాటు నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన సెప్టెంబర్‌ 20 వరకు అసెంబ్లీ, కౌన్సిల్‌ నిర్వహించే అవకాశముంది. ఆ తర్వాతే అపెక్స్‌ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమని చెప్తోంది.ఎట్లా చూసినా మరో నెలరోజుల తర్వాతే అపెక్స్‌మీటింగ్ నిర్వహించే అవకాశముందని సమాచారం.

పనులు ప్రారంభించేందుకు ఏపీ ఏర్పాట్లు

రాయలసీమ లిఫ్ట్‌ స్కీం పనులను శాస్త్రోక్తంగా మొదలు పెట్టాలనేయోచనలో ఏపీ ఉంది.శుక్రవారమే లిఫ్ట్‌ స్కీం పనులకు భూమి పూజ చేయాలని ఏపీ సీఎం జగన్‌ షెడ్యూల్‌ పెట్టుకున్నారు.శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి అక్కడే ప్రాజెక్టులపై రివ్యూ చేయడంతో లాంఛనంగా పనులు ప్రారంభించాలని భావించారు. అయితే అదేరోజు శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ పవర్‌ స్టేషన్‌లో భారీ ప్రమాదం జరగడం తో తన టూర్‌ వాయిదా వేసుకున్నారు. ఈ నెల 28న సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీం పై ఎన్‌జీటీ తీర్పు వెలువరించే అవకాశముంది. ఎన్‌జీటీకనుకగ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే పనులుమొదలు పెట్టాలనిజగన్‌ప్రభు త్వం ప్రణాళిక సిద్ధం చేస్తోం ది. సుప్రీంకోర్టు, హై కోర్టుల్లో పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నా, పనులపై వెనక్కి తగ్గే అవకాశంకనిపించడంలేదు.ఒకసారి పనులుమొదలు పెడితే అపెక్స్‌కౌన్సిల్‌ సైతంకన్వీ న్స్‌ అవుతుందని ఏపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు కేటాయించిన నీటినే తీసుకుంటామని, కేఆర్‌ఎంబీ రెగ్యులేషన్‌కు ఒప్పుకుంటామని చె ప్పడానికి సిద్ధ పడుతున్నట్టుగా సమాచారం. అదే జరిగితే దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టం వాటి ల్ల డం ఖాయమని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.