కేరళ పేలుళ్లతో ఢిల్లీలో హై అలర్ట్

కేరళ పేలుళ్లతో ఢిల్లీలో హై అలర్ట్

ఇటీవల జరిగిన కేరళలో పేలుళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు నగరం, దాని సరిహద్దుల చుట్టూ ప్రత్యేక బృందాలతో అసాధారణ కార్యకలాపాలను తనిఖీ చేస్తూ భద్రతను పెంచారు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, వేదికలు, మార్కెట్‌లు, మాల్స్, ప్రార్థనా స్థలాలు, మెట్రో స్టేషన్లు, బస్టాండ్‌లు వంటి తదితర ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల చుట్టూ భద్రతను పెంచినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. సెక్యూరిటీ, క్రైమ్ బ్రాంచ్, ప్రత్యేక సెల్స్ వంటి ప్రత్యేక విభాగాల సిబ్బందితో పాటు స్థానిక సిబ్బంది బహిరంగ ప్రదేశాల చుట్టూ గరిష్ట భద్రతను కల్పించాలని కోరారు.

Also Read : బైక్ స్టంట్స్ చేసినట్లు.. ట్రాక్టర్ తో స్టంట్స్

నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్, ఇతర ప్రాంతాల సరిహద్దులను కవర్ చేయడానికి బృందాలు బారికేడ్లను ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో పోలీసులు వ్యాన్‌లు, బైక్‌లలో పెట్రోలింగ్ చేస్తున్నారు. అక్టోబర్ 29న కేరళలోని కొచ్చిలోని కలమస్సేరిలో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వరుస పేలుళ్లలో ముగ్గురు మరణించారు, పలువురు గాయపడ్డారు. యెహోవాసాక్షులు ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడుకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.