నాగాలాండ్ ఘటన మాయని మచ్చలా మిగిలిపోతుంది

నాగాలాండ్ ఘటన మాయని మచ్చలా మిగిలిపోతుంది

ఆర్మీ కాల్పుల ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సాయుధ ధళాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈనెల 14న మిలింటెంట్లు ఉన్నారనే అనుమానంతో సామాన్యులపై ఆర్మీ టీం కాల్పులు జరిపింది. ఇందులో 14 మంది స్థానికులు, ఓ జవాన్ మరణించారు. తర్వాత పొరపాటున కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు ప్రకటన చేశారు. మృతి చెందినవారి కుటుంబాలకు కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కాల్పుల ఘటనతో ఏడాదికోసారి పది రోజులపాటు జరిగే హార్నబిట్ ఉత్సవాలను రద్దు చేసేందుకు కేబినెట్ నిర్ణయించినట్లు నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. కాల్పుల్లో మృతిచెందిన వారి అంత్యక్రియల్లో పాల్గొన్న నాగాలాండ్ సీఎం.. తమ రాష్ట్రంలో తలనొప్పిగా మారిన సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను తొలగించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కాల్పుల ఘటన దేశ చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుందన్నారు. వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం, ఇండ్లలో సోదాలు చేయడంతో పాటు సామన్య ప్రజలను కాల్చిచంపడం వంటి ఆరోపణలు వస్తున్నా భద్రతా దళాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.