ఢిల్లీ ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు దేశాన్ని భయాందోళనలకు గురిచేసింది. తాజా ఘటనతో స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ స్టాక్స్‌లో భారీ ర్యాలీ కనిపించింది.
దేశ రాజధానిలో ఎర్రకోట పేలుడు - స్టాక్ మార్కెట్‌లో ప్రభావం స్టాక్ మార్కెట్లకు కూడా విస్తరించింది. ఎర్రకోట మెట్రోస్టేషన్ దగ్గర కారులో జరిగిన శక్తివంతమైన పేలుడులో కనీసం 12 మంది మరణించగా, 30కుపైగా గాయపడ్డారు. అత్యున్నత భద్రతా సంస్థలు ఘటనపై విచారణ ప్రారంభించాయి, దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పేలుడుతో పాటు, భద్రతా సంస్థల చర్యలు, కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నలు మిగిలిపోవడం మార్కెట్‌లో అనిశ్చితిని పెంచింది.
డిఫెన్స్ స్టాక్స్ దూకుడు..
పేలుడు తర్వాతి రోజున మార్కెట్లో డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ హఠాత్తుగా పెరుగుదలను చూసాయి. MTAR Technologies, Data Patterns, Dynamatic Technologies లాంటి సంస్థలు 5%–6% మధ్య లాభపడగా. Garden Reach Shipbuilders & Engineers, Solar Industries లాంటి డిఫెన్స్ స్టాక్స్ కూడా 2.8%–4.5% వరకు లాభపడ్డాయి. ఈ షేర్ ర్యాలీకి ప్రధాన కారణం ఇటీవలి కాలంలో జరిగిన ఉగ్రదాడులు, భద్రత పై దేశం ఆందోళన, అలాగే ప్రభుత్వ స్పందన అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు ప్రముఖ ఇన్వెస్మెంట్ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ గత నెలలో సోలార్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్, డేటా ప్యాట్రన్స్, పిటిసి ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లకు కొనుగోలు రేటింగ్ అందించటం కూడా సెంటిమెంట్రను బలపరిచింది.
నేడు ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నప్పటికీ.. నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ మాత్రం మరింత వేగంగా పైకి వెళ్లింది. నేషనల్ సెక్యూరిటీ ప్రాధాన్యత, స్టాక్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారుల మనోభావం - ఇవన్నీ డిఫెన్స్ రంగానికి మద్దతు ఇచ్చే అంశాలుగా నిలిచాయి.ఎర్రకోట పేలుడు దేశ భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్న క్రమంలో ఇన్వెస్టర్లు డిఫెన్స్ షేర్లలో బలమైన నమ్మకంతో పెట్టుబడులకు దిగారు. భవిష్యత్‌లో ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా ఈ రంగంలో ఇలాంటి అప్రమత్తత, శక్తివంతమైన నడక కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
