ఢిల్లీ తర్వాత : రాజ్ కోట్ ఎయిర్ పోర్టులో కూలిన టెర్మినల్ టెంట్

ఢిల్లీ తర్వాత : రాజ్ కోట్ ఎయిర్ పోర్టులో కూలిన టెర్మినల్ టెంట్

గుజరాత్ లో భారీ వర్షాలు, ఈదురుగాలులు కారణంగా రాజ్‌కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని షెడ్ టెంట్ కూలిపోయింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఇది జరగడానికి ఒక్కరోజు ముందే శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇంధిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో టెర్నినల్ 1 దగ్గర షెడ్ కూలిపోయింది. దీంతో ఓ క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. అంతేకాదు ఐదుగురు గాయపడ్డారు. 

రాజ్ కోట్ విమానాశ్రయంలో ప్యాసింజర్స్ పికప్ అండ్ డ్రాప్ షెడ్ కు ఉన్న పరదా గాలివానకు చినిగిపోయి కిందపడిపోయింది.

ఢిల్లీ విమానాశ్రమంలోని టెర్మినల్ ఒకటి రూఫ్ కుప్పకూలిన ఘటనతో.. ఎయిర్ పోర్ట్ అధారిటీ స్పందించింది. టెర్మినల్ ఒకటి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. టెర్మినల్ వన్ నుంచి విమాన రాకపోకలను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టెర్మినల్ ఒకటి మూసివేస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది.