భార్య, భర్త ఓ డ్రైవర్ ట్విస్ట్ : నాలుగేళ్ల తర్వాత భర్తను చంపిన భార్య అరెస్ట్

 భార్య, భర్త ఓ డ్రైవర్ ట్విస్ట్ : నాలుగేళ్ల తర్వాత భర్తను చంపిన భార్య అరెస్ట్

 డ్రైవర్ తో కలిసి భర్తను హత్య చేసింది ఓ వీర మహిళ. హత్య చేసిన నాలుగేళ్లకు పోలీసులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. సెంథిల్ కుమార్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. 2015 సెంథిల్ తన తమ్మడి హత్య కేసులో నిందితుడిగా జైలుకి వెళ్లాడు. 2017లో విడుదల అయ్యాడు. విడుదల అయ్యేటప్పటికి సెంథిల్ కారు డ్రైవర్ రాజేష్ ఖన్నా, అతని భార్య మేనకతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం తెలిసింది.

 దీంతో సెంథిల్ తన భార్య పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయాడు. విషయం భర్తకు తెలిసిపోయిందనుకున్న భార్య సెంథిల్ ను హత్య చేసేందుకు రాజేష్ ఖన్నాతో కలిసి ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం సెంథిల్ ను దారుణంగా హత్య చేసి విల్లుపురం జిల్లాలోని జింగీలో పాతిపెట్టారు. ఏమి తెలియనట్టు భార్య మేనక తన భర్త సెంథిల్ కనపించడంలేదని పోలీసులకు ఫిర్యాధు చేసింది. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ రాజేష్ ఖన్నా హత్య చేసినట్టు గుర్తించారు. రాజేష్ ఖన్నాను అరెస్టు చేశారు. రాజేష్ దొరకగానే మేనక పారరైంది. సెంథిల్ ను పూడ్చిన స్థలంలో ఆయన ఎముకలు బయటపడటంతో పోలీసులు కేసును మరింత ముందుకు జరిపారు. మేనక కోసం నాలుగేళ్లుగా వేట సాగించారు. 

చివరకు రాజేష్ ఖన్నా ఇంట్లోనే నివాసం ఉంటున్నట్టు పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. మేనకను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇన్ని రోజులు రాజేష్ ఇంట్లో ఉంటే తమకెందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఇంటి పక్కని వారిని ప్రశ్నించారు. తామంత రాజేష్ బంధువు అనుకున్నామని పోలీసులతో చెప్పారు.