ఇదేం వెరైటీ : హైదరాబాద్ లో హలీం దోశలు

ఇదేం వెరైటీ : హైదరాబాద్ లో హలీం దోశలు

రంజాన్ అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చే వంటకం హలీమ్.  ముస్లింలే కాదు కులమతాలకు పట్టింపు లేకుండా దీనిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. రుచికరమైన హలీమ్‌కు మన హైదరాబాదే ప్రసిద్ధి గాంచింది. హైదరాబాద్ అంటేనే వెరైటీ ఫుడ్ లకు పెట్టింది పేరు. అందులోనూ హలీమ్‌ను హైదరబాద్ లో తినకుండా బహుశా ఉండరేమో. 

అయితే ఇప్పుడు హలీమ్ దోశ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వినడానికి కాస్త వెరైటీగా ఉంది కదా.. కానీ తిన్నవాళ్లు మాత్రం టేస్ట్ సూపర్ గా ఉందంటున్నారు. ఇది విజయనగర్ కాలనీలోని ఓ హోటల్ లో ఈ హలీమ్ దోశను  స్పెషల్ గా  చేస్తున్నారు.  సోషల్ మీడియాలోసర్క్యులేట్ అవుతున్న ఈ వైరల్ రీల్ హలీమ్ దోశ తయారుచేసే విధానాన్ని చూపుతుంది, సాధారణ దోశ పైన చిన్న టిన్ హలీమ్ ను పోసి రౌండగా రాస్తారు.  ఆ తర్వాత దానిపై జున్ను వేస్తారు.  హైదరాబాద్ అంటే దోశ, హలీమ్ లకు ప్రసిద్ది గాంచింది. అలాంటిది ఈ మిక్సి్ంగ్ ఐటమ్ ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. 

ALSO READ :- అమ్మాయిని వేధించిన పోకిరీలు.. తల్లిదండ్రులపై తల్వార్లతో దాడి

ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా హలీమ్ ను చాలా  ఇష్టంగా కొనుక్కుని తింటారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. ఇరాన్ లో పుట్టిన వంటకాన్ని తయారు చేయడానికి ఎనిమిది నుండి తొమ్మిది గంటల సమయం పడుతుంది.  హైదరాబాద్‌ నగరంలో హలీం తయారీలో పిస్తాహౌస్‌ అంతర్జాతీయంగా పేరుగాంచింది. ప్యారడైస్‌, కేఫ్‌ 555, హైదరాబాద్‌ హౌస్‌ వంటి సంస్థలు కూడా హలీం తయారుచేస్తాయి. శాకాహారులకు కూడా వెజిటేరియన్‌ హలీమ్‌ అందుబాటులోకి తెచ్చారు.  ప్రస్తుతం చికెన్‌ హలీమ్‌ రూ.270 వరకు, మటన్‌ హలీమ్‌ రూ.350 వరకు ధర పలుకుతోంది.