కాబూల్ నుంచి భారత్ కు చేరుకున్న ఇండియన్స్

కాబూల్ నుంచి భారత్ కు చేరుకున్న ఇండియన్స్

తాలిబన్ల ఆక్రమణతో అతలాకుతలం అవుతున్న అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానం ఘజియాబాద్ హిండన్ ఏయిర్ ఫోర్స్ స్థావరానికి చేరుకుంది. ఈ విమానంలో 168 మంది ప్రయాణికులుండగా.. వారిలో 107 మంది భారతీయులే కావడం గమనార్హం. విమానం దిగిన వెంటనే ప్రయాణికులను కరోనా టెస్టు కోసం తరలించారు. మరోవైపు కాబూల్ నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. 

అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించగానే భారత రాయబార కార్యాలయాన్ని అధికారులు ఖాళీ చేశారు. అయితే భారత్ కు చెందిన దాదాపు వెయ్యి మంది పౌరులు వివిధ నగరాల్లో చిక్కుకున్నారు. వారిని గుర్తించి భారత్ కు తీసుకురావడం భారత అధికారులకు సవాలుగా మారింది. కాబూల్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. అఫ్గనిస్థాన్ నుంచి భారతీయులను తరలించడానికి ప్రతి రోజూ 2 విమానాలను కాబూల్ కు నడుపుతున్నట్టు ఆయన చెప్పారు.