
Pakistan Army HQ: పైకి మేకపోతు గాంభీర్యం వెలగెబుతున్న పాకిస్థాన్.. గతవారం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కుప్పకూలింది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై భారత దాడి కోలుకోలేని దెబ్బగా యుద్ధ నిపుణులు చెబుతున్నారు. 25 నిమిషాల్లో 24 నిస్సైల్స్ పంపి వణుకు పుట్టించిన భారత వైమానిక దాడులు పాక్ ఆర్మీకి ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీగా ఉన్నాయి. భారత్ యుద్ధ భూమిలో చూపిన ఖచ్చితత్వాన్ని ప్రపంచ దేశాలు కొనసాయాడుతున్నాయి. పైగా ఇది మేడ్ ఇన్ ఇండియా మిస్సైల్స్ పనితీరుకు వాస్తవ సాక్ష్యంగా కూడా నిలవటంతో పాక్ జాగ్రత్త పడాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్ చేపట్టిన దాడుల దృష్ట్యా పాకిస్థాన్ ఆర్మీ తన జనరల్ హెడ్ క్వార్టర్స్‌ను రావల్‌పిండిలోని చక్లాలా నుంచి ఇస్లామాబాద్ కు మార్చాలని చూస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇటీవల భారత్ జరిపిన దాడుల్లో కనీసం రెండు సైనిక రవాణా వాహనాలు దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. అక్కడ ఇంధన ట్రక్కులతో పాటు, గోదాము పైకప్పులు ధ్వంసం కావటంతో పాక్ అలర్ట్ అయ్యింది. రన్ వే దగ్గరే వాటి శిథిలాలు పడి ఉండటం శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది.
భారత్ దాడుల సమయంలో శనివారం తెల్లవారుజామున ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లోని బంకరులో తలతాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాక్ తన ఆపరేషన్స్ బేర్ వేరే చోటికి మార్చాలని చూస్తోంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ నగరానికి కేవలం10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్ ఖాన్ ఎయిర్ బైర్ లో ట్రాన్స్ పోర్ట్ స్క్వాడ్రన్లు, ఫ్యూయలింగ్ యూనిట్లు, ఎయిర్ ఫోర్స్ కాలేజీ వంటివి ఉండటంతో పాక్ తరలింపు నిర్ణయాన్ని పరిశీలిస్తోందని వెల్లడైంది.
అలాగే ప్రస్తుతం ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్.. పాక్ ఆర్మీ వ్యూహాత్మక ప్లానింగ్ డివిజెన్ హెచ్ క్వార్టర్స్ కి చేరువలో ఉంది. అక్కడి నుంచే పాక్ తన అణ్వాయుధాల నిర్వహణను చేపడుతోంది. ప్రస్తుతం పాక్ వద్ద దేశవ్యాప్తంగా 170 వరకు అణ్వాయుధాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న భ్రమ్మోస్ క్షిపణులను ఉపయోగించి పాకిస్థాన్ లోని దాదాపు 11 ఎయిర్ బేస్ లను టార్గెట్ చేయవచ్చు. ఇది పాకిస్థాన్ కి ఆందోళన కలిగిస్తున్న అతిపెద్ద అంశం. అందుకే పాక్ తన ఆర్మీ హెడ్ క్వార్టర్ మార్పు విషయంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలుస్తోంది. మరోపక్క బలూచిస్థాన్ లిబరేషన్ ప్రకటనతో పాక్ రక్షణ విషయంలో మరింతగా అప్రమత్తతను పాటించాలని కూడా భావిస్తోంది.