మహిళతో ముద్దులు.. తప్పు ఒప్పుకున్న మంత్రి

మహిళతో ముద్దులు.. తప్పు ఒప్పుకున్న మంత్రి
  • అవును నిజమే.. ఆ ఫోటోలో ఉన్నది నేనే
  • ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయాను.. సారీ

లండన్: మహిళకు ముద్దులు పెడుతున్న ఫోటోలో ఉన్నది నేనే.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయాను.. సారీ.. అంటూ క్షమాపణలు కోరుతూ ప్రకటన చేశారు బ్రిటన్ ఆరోగ్యశఆఖ మంత్రి మాట్ హన్ కాక్. కోవిడ్ మహమ్మారి ప్రబలినప్పటి నుంచి దేశాన్ని కాపాడుందకు రేయింబవళ్లు కష్టపడుతూనే ఉన్నాను.. నా వ్యక్తిగత అంశానికి సంబంధించి కుటుంబ సభ్యుల గోప్యత కోరుతున్నానని చెప్పారు. ఫోటోలో తాను ముద్దు పెట్టుకున్న యువతి తన కుటుంబ సభ్యురాలు కాదు. బంధువు అంతకంటే కాదు. ఆయన సహాయ అధికారి. చాలా కాలంగా అంటే 2000 సంవత్సరం నుంచి ఆమెతో ఆయన సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. గత నెలలోనే ఆమెను తన సహాయ అధికారిగా నియమించుకున్నారట. అంటే ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్నట్లు లెక్క. బ్రిటన్ ఆరోగ్యశాఖ వెబ్ సైట్ లో ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. రూపర్డ్ మర్డోక్ కు చెందిన ద సన్ టాబ్లాయిడ్ ఈ ముద్దు ఫోటోను కవర్ పేజీ బ్యానర్ ఐటమ్ గా ప్రచురించడం సంచలనం సృష్టించింది.

మంత్రి తాలుకూ ఫోటోలు, వీడియో సెక్యూరిటీకి సంబంధించినవి.. ఇంత టాప్ సీక్రెట్ సీసీ కెమెరా ఫోటో, వీడియోను ద సన్ కు ఎవరు లీక్ చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నా.. ఫోటోల తాలుకు వేడి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఫోటో నిజమో కాదో ధృవీకరించుకోవాల్సి ఉందంటూ మిగతా మీడియా చెబుతున్న తరుణంలో  ఆరోగ్యశాఖ మంత్రి హన్ కాక్ స్వయంగా స్పందించి ఫోటో తనదేనని అంగీకరించారు. కరోనా కట్టడి చర్యలకు సంబంధించిన అనేక కాంట్రాక్టులు తనకు నచ్చిన వారికి.. తన సన్నిహితులకే కట్టబెడుతున్నారని ఆయనపై ఆరోపణలు కోకొల్లలుగా వచ్చాయి. ఈ నేపధ్యంలో విపక్ష లేబర్ పార్టీ ద సన్ కథనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. సామాన్యులు అందరి లాగే మంత్రికి కూడా వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయని ఎద్దేవా చేసింది. ఫోటోలో ఉన్నది కుటుంబ సభ్యురాలు కాదట..  జనం సొమ్ముతో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా అధికారి అంటూ విమర్శలు గుప్పించింది.