తెలంగాణ ఏర్పడ్డాక 4మెడికల్ కాలేజీలు వచ్చాయి: ఈటల

తెలంగాణ ఏర్పడ్డాక 4మెడికల్ కాలేజీలు వచ్చాయి: ఈటల

ఉమ్మడి రాష్ట్రంలో వైద్యరంగంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు ఈటల. తెలంగాణ వచ్చిన తర్వాత 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి… తెలంగాణ రాష్ట్రం రాకముందు 5 మెడికల్‌ కాలేజీలు ఉండేవని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో కొత్తగా మెడికల్‌ కాలేజీలు పెట్టాలని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ఒక్కో కాలేజీని 150 సీట్లతో ప్రారంభించడం జరిగిందన్నారు. అంతేకాదు ప్రొఫెసర్ల కొరత లేకుండా ఉండేందుకు రిటైర్మంట్ వయస్సు కూడా పెంచినట్లు గుర్తు చేశారు. ఆస్పత్రుల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా 11 మెడికల్‌ కాలేజీలు, ప్రైవేట్‌ పరంగా 23 మెడికల్‌ కాలేజీలున్నాయన్నారు. వీటిలో మొత్తం 4790 సీట్లుండగా..1640 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నాయని, ఈఎస్‌ఐ కాలేజీలో 100 సీట్లు , ఎయిమ్స్ లో 50 సీట్లు ఉన్నాయని చెప్పారు ఈటల.