కేఎల్ రాహుల్ త్వరలో పుంజుకుంటాడు

కేఎల్ రాహుల్ త్వరలో పుంజుకుంటాడు

ఇంగ్లండ్‌‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. ఇంగ్లీష్ పేసర్ల ధాటికి భారత బ్యాట్స్‌‌మెన్ విలవిల్లాడారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా మరెవ్వరూ ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుస వైఫల్యాలు టీమ్‌‌ను దెబ్బతీశాయి. గత మూడు మ్యాచుల్లో రాహుల్ 0, 0, 1తో దారుణంగా ఫెయిలయ్యాడు. దీంతో అతడిపై వెటరన్ క్రికెటర్లు విమర్శలకు దిగుతున్నారు. అయితే రాహుల్‌ను ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వెనకేసుకొచ్చాడు. అతడో చాంపియన్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. 

‘ప్రతి ప్లేయర్‌ కూడా ఏదో ఓ దశలో విఫలమవ్వడం మామూలే. గతేడాది కాలంలో మన టీమ్‌‌లో టీ20 ఫార్మాట్‌టో అందరికంటే కేఎల్ రాహుల్ నిలకడగా, అత్యుత్తమంగా రాణించాడనేది గుర్తుంచుకోవాలి. అతడి బ్యాటింగ్ యావరేజ్ 40గా, స్ట్రయిక్ రేట్ 145గా ఉంది. కాబట్టి 3 మ్యాచుల్లో ఫెయిలైతే విమర్శించడం సరికాదు. అతడికి టీమ్ మొత్తం అండగా ఉండాల్సిన సమయమిది. త్వరలోనే రాహుల్ ఈ ఫేజ్‌‌ను అధిగమిస్తాడని ఆశిస్తున్నాం’ అని విక్రమ్ రాథోడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.