TSPSC : నియంత పాలనకు వ్యతిరేకంగా.. ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి : షర్మిల

TSPSC : నియంత పాలనకు వ్యతిరేకంగా.. ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి : షర్మిల

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రతి పక్షాలన్నీ కలిసి ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కలిసిన షర్మిల.. ఈ మేరకు తమతో కలిసి నడవాలని కోరారు. 

ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి ఇవేవీ పట్టట్లేదని మండి పడ్డారు. రాష్ట్రంలో మొత్తం లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... 80 వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు.

దాంట్లో 33 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిన.. కేవలం 8వేల ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు జరిపారని షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు పెరిగిపోతున్నాయి. విద్యార్థుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయన్నారు షర్మిల.