న్యూఢిల్లీ: భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగోరివిచ్ ఖోజిన్ బంగ్లాదేశ్‌కు సూచించారు. సోమవారం ఢాకాలోని రష్యా రాయబార కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ‘‘భారతదేశంతో ఉద్రిక్తతలను ఎంత త్వరగా తగ్గించుకుంటే బంగ్లాదేశ్‌కు అంత మంచిది. టెన్షన్ వాతావరణాన్ని తగ్గించుకోవడం ఈ రెండు దేశాలకే కాదు.
మొత్తం దక్షిణాసియా దేశాలకు చాలా కీలకం” అని ఆయన అన్నారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో భారత్, రష్యా పోషించిన పాత్రను కూడా అలెగ్జాండర్ గుర్తుచేశారు. భారత్ సాయంతోనే బంగ్లాకు ఇండిపెండెన్స్ వచ్చిందని, అందుకు రష్యా మద్దతుకూడా ఉందని చెప్పారు. మూక దాడులు, మైనార్టీల నిరసనలు, రాజకీయ అనిశ్చితితో పోరాడుతున్న ప్రస్తుత గందరగోళ పరిస్థితులను.. ఇంకా పెంచేలా ప్రవర్తించొద్దని అన్నారు.
ఇన్ని జరుగుతున్నా ఇప్పటివరకు బంగ్లాదేశ్ విషయంలో తాము జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉన్నామన్నారు. భారత్, బంగ్లా రెండు దేశాలతో తాము కలిసి పనిచేస్తామని చెప్పారు.
దేశంలో నిత్యం ఏదో ఒక గొడవ..
గత వారం విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది మరణం తర్వాత బంగ్లాదేశ్‌లో కొత్త అశాంతి నెలకొంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనానికి దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో హదీ కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈ క్రమంలోనే ఇటీవల కొంతమంది నిరసనకారులు భారత్‌పైకూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనకారుల బృందం చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్‌ను ముట్టడించడానికి ప్రయత్నించింది. దీంతో భారత్‌తన వీసా సేవలను నిలిపివేసింది.
