ఇంటర్ లో బైపీసీ, సీఈసీ చేసిన ఏకైక విద్యార్థి

ఇంటర్ లో బైపీసీ, సీఈసీ చేసిన ఏకైక విద్యార్థి
  • ఇంటర్మీడియట్ లో రెండు కోర్సులు పూర్తి చేసిన ఏకైక విద్యార్థి అగస్త్య జైస్వాల్
  • 9ఏళ్లకే టెన్త్... 11ఏళ్లకే ఇంటర్...
  • 14ఏళ్ల వయసులోనే బీఏ జర్మలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి
  • 1.72 సెకన్లలో A నుండి Z వర్ణమాలలను రెండు చేతులతో టైప్ చేయగల సామర్థ్యం
  • జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు కూడా

ఇంటర్ లో ఒక్క సంవత్సరంలో ఒక్క కోర్సు పూర్తి చేయడానికే విద్యార్థులు నానా తంటాలు పడ్తుంటారు. కొందరైతే ఎలాగోలా పాసయ్యి.. నెక్స్ట్ లెవల్ కి పోతే చాలని భావించేవాళ్లూ ఉంటారు. కానీ ఇలా ఆలోచించే వాళ్లందరికీ వ్యతిరేకంగా ఆలోచిస్తూ.. ధీటుగా సమాధానమిస్తున్నాడు ఓ విద్యార్థి. అందరిలా కాకుండా ఇంటర్మీడియట్ లో రెండు కోర్సులు చేసి... ఔరా అనిపిస్తున్నాడు. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరు.. ఇలా కోర్సులు పూర్తి చేయడం వెనుక ఉన్న కారణాలేంటీ.. అనే విషయాల్లోకి వెళితే....

హైదరాబాద్ లోని కాచిగూడకు చెందిన అగస్త్య జైస్వాల్ (16) అనే విద్యార్థి ఇంటర్మీడియట్ లో బైపీసీ(బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ), సీఈసీ (సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్) అనే రెండు విభాగాలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఇటీవల వెలువడిన తెలంగాణ ఫలితాలలో సత్తా చాటిన అగస్త్య...  ఈ ఫలితాల్లో బైపీసీ, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో అగస్త్య జైస్వాల్ 81 శాతం ఉత్తీర్ణతతో పాసయ్యాడు. ఇప్పుడే కాదు.. అంతకుముందు అగస్త్యకు 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ లో CEC విభాగం చదివి, పాసైన మెుదటి విద్యార్థిగా అగస్త్య రికార్డు స-ృష్టించాడు. 

ఇకపోతే అగస్త్య ఏది చేసినా రికార్డు క్రియేట్ చేసేదిగానే ఉంటుందనడానికి ఆయన.. 2020లో14 కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే బీఏ జర్మలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతిచిన్న వయస్కుడిగా నమోదు కావడం ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. అంతేకాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్‌ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. అంతే కాదు9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి, 11 ఏళ్లలో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులుగా పేరు తెచ్చకున్నాడు అగస్త్య

 తల్లిదండ్రులే గురువులు. వారి మద్దతు, శిక్షణతో తాను ఏదైనా సాధించగలనన్న నమ్మకంతో దూసుకుపోకున్న అగస్త్య...  అసాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని నిరూపిస్తున్నాడు. కేవలం జ్ఞానాన్ని సంపాదించడం కోసమే తానిలా రెండు కోర్సులు చేశానని చెబుతున్న అగస్త్యకు మరికొన్ని టాలెంట్స్ కూడా ఉన్నాయట.  కేవలం 1.72 సెకన్లలో A నుండి Z వర్ణమాలలను రెండు చేతులతో  టైప్ చేయగల సామర్థ్యం... నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకున్నాడు.  అగస్త్య జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు కూడా. ఇక అగస్త్య జైస్వాల్‌ సోదరి నైనా జైస్వాల్‌ టేబుల్‌ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ 13 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.