భారతీయ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ప్రతి నెల తమ పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటూ పోతున్నారు. నేరుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్ అని ఫీలవుతున్న ఇన్వెస్టర్లు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వివిధ స్కీమ్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తాజా డేటా ప్రకారం తెలుస్తోంది.
గడచిన 5 ఏళ్లుగా సగటున 17 శాతం పైగా రాబడిని అందించిన అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పై ఇన్వెస్టర్లు మనసు పారేసుకుంటున్నట్లు తేలింది. ఈ ఫండ్స్ లో సగటున 72 శాతం ఈక్విటీ, 21 శాతం డెట్ ఉంటాయి. కంపెనీలు భారీగా లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడులు పెడతాయి. 2025 ఆగస్టు వరకూ ఈ ఫండ్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ రూ.2.5 లక్షల కోట్లకు పెరిగింది.
ఈ ఫండ్స్ ఈక్విటీ లాభాలను పొందేటప్పుడు.. డెట్ భాగం ద్వారా పెట్టుబడిదారులకు సురక్షితమైన స్థిరమైన రాబడులు ఇస్తాయి. ఏడాది కాలానికి సగటున సుమారు 7 శాతం, 2 ఏళ్లకు 16.5 శాతం, 5 ఏళ్లకు 17 శాతానికి మించి ఈ ఫండ్స్ రాబడి అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, మహీంద్రా మనులైఫ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ వంటి స్కీమ్స్ ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణను చూస్తున్నాయి. పైగా ఇవి మంచి రాబడులను కూడా డెలివర్ చేశాయి.
Also Read : ఆసియా కరెన్సీల్లో అత్యంత బలహీనంగా రూపాయి.. కారణాలు ఇవే..
SEBI రూల్స్ ప్రకారం ఈ ఫండ్స్ కనీసం 65 శాతం ఈక్విటీ పెట్టుబడి పెట్టాలి. సాధారణంగా 72 శాతం ఉంటుంది. ఈ ఫండ్స్ సుదీర్ఘ కాలం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఈక్విటీ-డెట్ మిశ్రమాన్ని పూర్తిగా నియంత్రించలేవు. ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ఓలటాలిటీ క్రమంగా తగ్గుతూ సుదీర్ఘ కాలంలో మంచి వృద్ధి సాధించగలుగుతారు. అంతకుముందు మార్కెట్‌లో ఈక్విటీ ధరలు మారుతున్నప్పుడు ఈ ఫండ్స్ పెరిగే అవకాశాలను కూడా పొందగలవు. ఈ విధంగా బలమైన హైబ్రిడ్ ఫండ్‌లు సైక్లికల్ రాబడులను పునరుద్ధరించడంలో సహాయపడటంతో ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణను పొందుతున్నాయి.
