రాజ్భవన్ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

రాజ్భవన్ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన

బీఆర్ఎస్ వీ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పిలుపు మేరకు భారీగా తరిలివచ్చిన విద్యార్థి నాయకులు రాజ్ భవన్ ముందు బైటాయించిచారు. రాజ్ భవన్ ముట్టడికి యత్నిస్తున్నారు. దీంతో రాజ్ భవన్ లోకి వెళ్ల కుండా భారీడా పోలీసులను మోహరించారు. బారీకేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల మధ్య తోపులాటలు, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. 

యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లును అమోదించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరుపుతున్నారు. గవర్నర్ బిల్లు ఆమోదించకుండా పెండింగ్ పెట్టి పార్షియాలిటీ చూపిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లు వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.