బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) దూసుకెళ్తోంది. విడుదలై 16 రోజులైన బాక్సాఫీస్ కలెక్షన్లతో ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన మూవీ ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల్లో డిసెంబర్ 20 నాటికి రూ.785 కోట్ల పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు చేరువలో ఉంది.
ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే, 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అవతార్: ఫైర్ అండ్ యాష్ మూవీ నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ ‘ధురంధర్’ తగ్గేదేలే అనేలా రాణిస్తోంది. రిలీజైన మొదటిరోజు రూ.28 కోట్లు సాధిస్తే, 16వ రోజు మాత్రం ఇండియాలో రూ.33 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియా వైడ్ నెట్ వసూళ్లు గమనిస్తే.. డే1 నుంచి డే16 వరకు లెక్కలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే ఊపు ఈ వీకెండ్ కూడా కొనసాగితే.. గత సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. టాప్ 3 బాలీవుడ్ చిత్రాలైన 'స్ట్రీ 2' (రూ.598 కోట్లు), 'ఛావా' (రూ.601 కోట్లు), 'జవాన్' (రూ.640 కోట్లు) వైపు దూసుకెళ్తుంది దురంధర్. ఇండియాలోనే ధురంధర్ రూ.700 కోట్ల నెట్ మార్క్ దాటుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధురంధర్ ఇండియా రోజువారీ నెట్ వసూళ్లు:
ఫస్ట్ డే (డిసెంబర్ 5) శుక్రవారం= రూ. 28.60 కోట్లు
సెకండ్ డే = శనివారం రూ. 33.10 కోట్లు
థర్డ్ డే = ఆదివారం రూ.43 కోట్లు
నాలుగో రోజు = మొదటి సోమవారం రూ.23.25 కోట్లు
ఐదో రోజు = మంగళవారం రూ. 27 కోట్లు
ఆరో రోజు = బుధవారం రూ.27 కోట్లు
ఏడో రోజు = గురువారం రూ.27 కోట్లు
ఎనిమిదో రోజు = శుక్రవారం రూ.32.5 కోట్లు
తొమ్మిదో రోజు = శనివారం రూ. 53 కోట్లు
పదో రోజు = ఆదివారం ఏకంగా రూ.58 కోట్లు
11వ రోజు [2వ సోమవారం] రూ. 30.5 కోట్లు
12వ రోజు [2వ మంగళవారం] రూ.30.5 కోట్లు
13వ రోజు [2వ బుధవారం] రూ. 25.5 కోట్లు
14వ రోజు [2వ గురువారం] రూ.23.25 కోట్లు
15వ రోజు [3వ శుక్రవారం] రూ.22.5 కోట్లు
16వ రోజు [3వ శనివారం] రూ.33.5 కోట్లు
మొత్తం 16 రోజుల్లో= రూ.518.52 కోట్ల నెట్ సాధించింది.
ఇదిలా ఉంటే .. రణవీర్ సింగ్ టాప్ హిందీ నెట్ కలెక్షన్ సినిమాల లెక్కలు గమనిస్తే.. ధురంధర్ టాప్ ప్లేస్లో నిలిచింది.
హిందీ నెట్ కలెక్షన్స్
1. ధురంధర్ రూ.516.5 కోట్లు
2. పద్మావత్ రూ.302.15 కోట్లు
3. సింబా రూ.240.3 కోట్లు
4. బాజీరావ్ మస్తానీ రూ.184.3 కోట్లు
5. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ రూ.153.55 కోట్లు
6. గల్లీ బాయ్ రూ.139.63 కోట్లు
7. గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా రూ.117.53 కోట్లు
8. 83 = రూ.104.13 Cr
9. గుండే రూ.78.61 కోట్లు
10. దిల్ ధడక్నే డూ రూ.76.81 కోట్లు
