శంబాలతో సేఫ్ జోన్‌‌‌‌లో ఉన్నాం..

శంబాలతో సేఫ్ జోన్‌‌‌‌లో ఉన్నాం..

ఆది సాయికుమార్,  అర్చనా అయ్యర్ జంటగా   యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌‌‌ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి నిర్మించిన  చిత్రం ‘శంబాల’. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఆది సాయి కుమార్‌‌‌‌‌‌‌‌తో ముందు  వేరే  కథ అనుకున్నాం.  ఇంతలో యుగంధర్ చెప్పిన  ఈ స్టోరీ బాగా నచ్చడంతో దీంతో ముందుకెళ్లాం.  స్టోరీ పరంగా చూస్తే ఇది టోటల్ డిఫరెంట్  సినిమా.  ఏ సినిమాతో దీనికి పోలిక లేదు. సినిమాకు బలం కంటెంటే.  ‘కల్కి’ వచ్చిన తరువాత శంబాల అనేది అందరికీ తెలిసింది. 

ఇందులో ఆ ప్లేస్ ఏంటి,  దాని మీనింగ్ ఏంటి  అనేది  కనిపిస్తుంది.  ఈ సినిమాలో హారర్‌‌‌‌‌‌‌‌తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి ఉంటాయి.  అన్నిరకాల కమర్షియల్‌‌‌‌ ఎలిమెంట్స్‌‌‌‌తో అవుట్‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది.  ఆదికి  హిందీలోనూ మంచి మార్కెట్ ఉంది. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత  హిందీ రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం.  నైజాంలో మైత్రి, ఏపీ, సీడెడ్‌‌‌‌లో ఉషా పిక్చర్స్  వాళ్లు గ్రాండ్‌‌‌‌గా  రిలీజ్ చేస్తున్నారు.  

ఇప్పటికే జరిగిన బిజినెస్‌‌‌‌తో సేఫ్ జోన్‌‌‌‌లోకి వచ్చాము. శాటిలైట్, ఓటీటీ రైట్స్ ద్వారా 80 శాతం రికవరీ వచ్చేసింది.  ఇంకో 20 శాతం రికవరీ బ్యాలెన్స్ అంతే. థియేట్రికల్ రన్‌‌‌‌తో లాభాల్లోకి వస్తామని నమ్ముతున్నాం. ఈ మూవీకి సీక్వెల్‌‌‌‌ స్కోప్ ఉంది. అందుకే సెకండ్ పార్ట్ కోసం చిన్న లీడ్ ఇచ్చాం’ అని చెప్పారు.