గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ అమ్మవారు భగవంతుడినే భర్తగా భావించి.. ఆయన్ను చేరుకోవడానికి చిత్తశుద్ధితో సంకల్పించిన వ్రతమే ఈతిరుప్పావై . ఇందులో 30 పాశురాలు ఉంటాయి. ధనుర్మాసంలో ఐదోరోజు పఠించాల్సిన పాశురాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోనృం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్‍ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళై’యుం పుగుదరువా నిన్ఱనవుం
తీయినిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్.
భావము : ఓ కృష్ణా ! పరమ భాగ్యవతియగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగ అవతరించి, అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రునివలె పెరుగుచుండగా. గూఢచారులవలన యీ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు అలోచించుచుండగా అతని యత్నములన్నిటిని వ్యర్ధముచేసి అతని గర్భమున చిచ్చుపేట్టినట్లు నిల్చిన భక్తవత్సలుడవు! అట్టి నిన్ను భక్తీ పురస్సరముగా ప్రార్ధించి నీ సన్నిధికి చేరినాము. మాకు యిష్టార్దమైన 'పఱ' అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి యాశపడదగిన సంపదను, దానిని సార్ధిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషములవలన కలిగిన సంకటమును నివారణ చేసికొని మేము సుఖింతుము నీ విట్లు కృపచేయుటవలన మా యీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును.
గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపం అయిన వాడు. యశోదా మాతచే తాడుతో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానిస్తే మన గత జన్మ పాపములను నశింపజేసే వాడు. శ్రీకృష్ణుడు. మనం చేసిన పాపాలు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కనుక భక్తితో భగవంతుడి నామాలు పాడమని గోదాదేవి గోపికలకు ఈ పాశురంలో తెలిపింది.
మన పాపాలు తొలిగేందుకు శ్రీకృష్ణుడికి అర్పించాల్సిన 8పుష్పాలు: 1 అహింస 2 ఇంద్రియ నిగ్రహం ౩ సర్వభూతదయ 4 క్షమ 5 జ్ఞానం 6 తపస్సు 7 సత్యం 8 ధ్యానం ఇవి విష్ణు ప్రీతి కరమైన పుష్పాలు . వీటి తో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృపకు పాత్రులు కావాలి. మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!' అని అండాళ్ తల్లి స్వామి ఆయా . అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. ...తిరుప్పావై వ్రతం ఆచరించాలనుకునే వాళ్లు సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించి క్రమం తప్పకుండా ప్రతి రోజూ రోజుకు ఒక పాశురం చొప్పున స్వామి కీర్తనలను పాడాలి.
