జాండీస్ తో కొడుకు.. గుండెపోటుతో తండ్రి మృతి

జాండీస్ తో కొడుకు.. గుండెపోటుతో తండ్రి మృతి
  • యాదాద్రి జిల్లా నెమిలలో తీవ్ర విషాదం

రాజాపేట, వెలుగు :  అనారోగ్యంతో కొడుకు.. గుండెపోటుతో తండ్రి మృతిచెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. రాజపేట మండలం నెమిల గ్రామానికి చెందిన మోత్కుపల్లి బాలకిషన్(35), కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య వార్డు మెంబర్ గా పోటీ చేయడంతో ఎన్నికల బిజీలో హెల్త్ ను సరిగా పట్టించుకోలేదు.

జాండీస్ తో చికిత్స పొందుతూ శుక్రవారం బాలకిషన్ చనిపోయాడు. మృతుడుకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి ఐలయ్య(60), అదేరోజు రాత్రి గుండెపోటుతో మరణించారు. ఒకే రోజు తండ్రీ కొడుకు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.