కాసేపట్లో స్వస్థలానికి రాకేష్ మృతదేహం

కాసేపట్లో స్వస్థలానికి రాకేష్ మృతదేహం

అగ్నిపథ్ పథకం నేపథ్యంలో చెలరేగుతున్న అల్లర్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుని.. తీవ్ర అలజడిని సృష్టించాయి. కాగా ఈ నిరసనలో పాల్గొన్న ఆందోళనకారులపైకి పోలీసులు కాల్పులు జరపగా... ఛాతిలో బుల్లెట్ తగిలి... రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. చికిత్స కోసం ముందుగా గాంధీ హాస్పిటల్ కు తరలించిన అధికారులు.. మరణాంతరం రాకేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకి  తరలించారు. ఇప్పటికే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్ రావు పలువురు నేతలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించారు. మరికొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడిప్పుడే ఎంజీఎంకు చేరుకుంటున్నారు. కాసేపట్లో ఎంజీఎం నుంచి రాకేష్ ఇంటి వరకు భారీ ర్యాలీ కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా రాకేష్ స్వగ్రామం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్ పేటలో జరగనున్న అంత్యక్రియలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.