అగ్నిపథ్తో సైనిక బలగాలు బలహీనం

 అగ్నిపథ్తో సైనిక బలగాలు బలహీనం
  • ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ స్కీంతో దేశ భద్రతకు ముప్పు అని, ఆ స్కీంను వాపస్ తీసుకోవాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మాజీ సైనికుడిగా తనకు బాధ కలిగించిందని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అగ్నిపథ్​ ప్రకటించి సైనిక బలగాలను కేంద్రం బలహీన పరుస్తోందన్నారు. 75 ఏండ్లుగా త్రివిధ దళాలు బార్డర్లలో కాపలా కాస్తున్నాయని ఇప్పుడు ఏ లోపం ఉందని రెగ్యులర్ రిక్రూట్​మెంట్​ను కాదని అగ్నిపథ్​ తెచ్చారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పించన్లు తగ్గించుకోవడానికే ఈ పథకం తెచ్చారని ఉత్తమ్​ ఆరోపించారు.