ఖమ్మంలో ప్రారంభమైన అగ్నివీర్​ ర్యాలీ.. వారం రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ

ఖమ్మంలో ప్రారంభమైన అగ్నివీర్​ ర్యాలీ.. వారం రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ
  • మొదటి రోజు 329 మంది మెడికల్​ టెస్ట్​కు ఎంపిక

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : అగ్నివీర్ రిక్రూట్​మెంట్​ ర్యాలీ శుక్రవారం తెల్లవారుజామున ఖమ్మంలోని సర్ధార్​ పటేల్​ స్టేడియంలో ప్రారంభమైంది. అభ్యర్థులకు1600 మీటర్ల పరుగు పందెం, 9 ఫీట్​బ్రాడ్ ​జంప్​, జడ్ ​క్రాస్ ​బార్​పోటీలతో పాటు ఎత్తు, బరువు, ఫిట్​నెస్ ​పరీక్షలు నిర్వహించారు. 1225 మందిలో మొదటి రోజు 926 మంది హాజరు కాగా 329 మంది మెడికల్​ టెస్ట్​కు ఎంపికయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రారంభమైన ర్యాలీ ఉదయం 8.30 గంటల వరకు కొనసాగింది. 

ర్యాలీని శుక్రవారం తెల్లవారుజామున కలెక్టర్‌‌ శ్రీ వి.పి. గౌతమ్‌‌ పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌‌  తెలిపారు. వెంట ఆర్మీ కల్నల్‌‌ కిట్స్‌‌ కె దాస్‌‌, జిల్లా స్పోర్ట్స్​డెవలప్​మెంట్​ఆఫీసర్​సునీల్‌‌ రెడ్డి, అర్బన్‌‌ తహసీల్దార్​స్వామి ఉన్నారు.