ములుగు, వెలుగు: ములుగులోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీ, బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మధ్య మంగళవారం ఒప్పందం జరిగింది. బాటిల్స్ ఫర్ చేంజ్ అనే సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నట్లు వర్సిటీ వీసీ రాజిరెడ్డి చెప్పారు. ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ కు ఉపయోగపడే విలువైన వనరుగా గుర్తించాలన్నారు.
ఒప్పందం ప్రకారం వర్సిటీలో వివిధ పనులకు ఉపయోగించిన ప్లాస్టిక్‌ను వేరుచేసి రీసైక్లింగ్ కు పంపిస్తామన్నారు. కార్యక్రమంలోని రిజిస్టర్ భగవాన్, బిస్లెరి సంస్థ డైరెక్టర్ గణేశ్, చినా నాయక్, లక్ష్మీనారాయణ, సురేశ్ కుమార్, విజయ పాల్గొన్నారు.
