జనగామ అర్బన్, వెలుగు: జనగామ మార్కెట్కు శుక్ర, శనివారాల్లో సెలవులు ప్రకటించినట్లు ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ తెలిపారు. యార్డులో వ్యాపారస్తులు కొనుగోలు చేసిన సరుకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
