డీసీసీబీ బ్రాంచ్ ను ప్రారంభించిన తుమ్మల

డీసీసీబీ బ్రాంచ్ ను ప్రారంభించిన తుమ్మల

మణుగూరు, వెలుగు: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ ను  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. సహకార బ్యాంక్ గతంలో ఉన్న బిల్డింగ్ నుంచి మరో అద్దె బిల్డింగ్ లోకి మార్చారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి చేరువలో ఉండేలా సహకార బ్యాంక్ ను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయడంతో పాటు సబ్సిడీ ధరల్లో ఎరువులు, విత్తనాలను బ్యాంకు ద్వారా అందుతున్నాయని, ఈ బ్యాంకును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంత రైతులతో పాటు అధికారులకు ఉందన్నారు. 

నియోజకవర్గంలో మారెళ్ల పాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఇది పూర్తయితే 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. పులుసుబొంత ప్రాజెక్టుకు ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీపీఐ నేత అయోధ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేశ్​ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ నరేశ్, మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర, డీసీసీబీ సీఈవో వెంకట ఆదిత్య, ఏజీఎంఎస్ నవీన్ కుమార్, చంద్రరావు, డీసీఓ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ బాలరాజు, సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.