సాయిల్ హెల్త్ వలంటీర్ల కు శిక్షణ : అగ్రి కల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య

సాయిల్ హెల్త్ వలంటీర్ల కు శిక్షణ : అగ్రి కల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య
  • రెండు నెలల్లో 30 వేల మందికి ఇస్తాం : అగ్రికల్చర్ ​వర్సిటీ వీసీ  

హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్​అగ్రికల్చర్ వర్సిటీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం వీసీ అల్దాస్​జానయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేల ఆరోగ్యంపై విస్తృత కార్యక్రమాలకు ఆమోదం లభించింది. ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున 30 వేల మంది సాయిల్ హెల్త్​ వలంటీర్లకు వచ్చే రెండు నెలల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

వర్సిటీ పరిధిలోని 31 రైతు విజ్ఞాన కేంద్రాలు, 15 పరిశోధనా సంస్థల్లో సాయిల్ హెల్త్(నేల ఆరోగ్యం), భూసార కార్డులు, పరీక్షల నివేదికల రూపకల్పనపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 27 నుంచి మే 25 వరకు నిర్వహించేందుకు పాలక మండలి అనుమతించింది. దాదాపు 200 బృందాలు 1,600 గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించనున్నాయని వీసీ తెలిపారు.