ప్రత్యేక మ్యాపింగ్ ను సక్సెస్ చేయాలి : వరంగల్ కలెక్టర్ సత్య శారద

ప్రత్యేక మ్యాపింగ్ ను సక్సెస్ చేయాలి : వరంగల్ కలెక్టర్ సత్య శారద

గ్రేటర్ వరంగల్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని వరంగల్​ కలెక్టర్ సత్య శారద సూచించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్‌లో వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అడిషనల్​ కలెక్టర్ సంధ్యారాణి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

మ్యాపింగ్​ ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితంగా పూర్తి చేయాలంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలన్నారు. అనంతరం అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్​లో విద్యార్థులు వివిధ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను కలెక్టర్​ సందర్శించారు.