మనుషులు, సైతాను ఎదురెదురుగా ఉంటే..

మనుషులు, సైతాను ఎదురెదురుగా ఉంటే..

మలయాళ స్టార్  టొవినో థామస్  నటించిన లేటెస్ట్ మూవీ ‘పళ్లిచట్టంబి’.  డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో   నౌఫల్, బ్రిజీష్, చాణుక్య  చైతన్య చరణ్ నిర్మించారు.  ఏప్రిల్ 10న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ  భాషల్లో  థియేట్రికల్ రిలీజ్‌‌కు రాబోతోంది. సోమవారం టీజర్‌‌‌‌ను విడుదల చేశారు.   

ఒక పురాతన చర్చి నేపథ్యంతో ఆసక్తికరంగా ఈ టీజర్ ప్రారంభమవుతుంది.  ఆ చర్చి  మీద కొందరు దెయ్యాల్లాంటి మనుషుల కన్నుపడుతుంది. ఆ రాక్షసులు అమాయకులైన ప్రజల్ని హింసిస్తారు. ‘మనుషులు, సైతాను ఎదురెదురుగా ఉండే ప్రదేశంలో దేవుడితో పనేంటి..’ అనే డైలాగ్  కథలోని కాన్‌‌ఫ్లిక్ట్ ఎలా ఉండబోతోంది అనే అంశాలపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.  

ఈ చర్చిని, అమాయక ప్రజల్ని కాపాడేందుకు టొవినో థామస్  ఎలాంటి పోరాటం చేశాడు అనేది చూపించారు. 1950–60  బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే ఈ కథలో  టొవినో సరికొత్తగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. కయదు లోహర్ హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రంలో విజయరాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం ఇతర పాత్రలు పోషించారు.  జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.