అశ్వా రావు పేట మండలంలో చిన్నారులకు అస్వస్థత 

అశ్వా రావు పేట మండలంలో చిన్నారులకు అస్వస్థత 

అశ్వారావుపేట, వెలుగు: కాలం చెల్లిన డ్రింక్స్ తాగి ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో బేరన్ పొగాకు పనిచేసేందుకు ఏపీ నుంచి వలస కూలీలుగా వచ్చిన జూపూడి గోపాలరావుకు రెండు, నాలుగు సంవత్సరాల ఇద్దరు కొడుకులు ఉన్నారు.

ఊట్లపల్లిలోని ఓ దుకాణంలో ఓ కంపెనీకి చెందిన డ్రింక్ బాటిల్ ను గోపాలరావు తీసుకువెళ్లి పిల్లలకు తాగించాడు. కొద్దిసేపటికి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు కావడంతో అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. బాధితుడు కొనుగోలు చేసిన డ్రింక్ బాటిల్ ఐదు నెలల కింద కాలం చెల్లినట్లుగా గుర్తించారు.