V6 News

కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం : కాసుల బాల్రాజ్

కాంగ్రెస్తోనే  అభివృద్ధి, సంక్షేమం : కాసుల బాల్రాజ్
  • అగ్రోస్​ చైర్మన్​ కాసుల బాల్​రాజ్​

బీర్కూర్, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అగ్రోస్​ చైర్మన్​ బాల్​రాజ్​ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్​ బలపర్చిన అభ్యర్థి మేకల విఠల్​ కు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో ఒక్క రేషన్​ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి రేషన్​ కార్డు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు.

 గ్రామల్లో మౌలిక వసతుల కోసం కాంగ్రెస్​ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు.  కాంగ్రెస్ సర్పంచ్​, వార్డు మెంబర్ల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకుముందు హనుమాన్​ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి  ప్రచారం చేశారు. రఘు, గంగాధర్​, బస్వరాజ్​ పటేల్​, విజయ్​ ప్రకాశ్, రాములు, శశికాంత్,  సందీప్ పటేల్ పాల్గొన్నారు.