OTT Bold: రొమాంటిక్, కిస్ సీన్లతో.. ఓటీటీకి తెలుగు బోల్డ్ సిరీస్.. మూడో గులాబీ గ్లామర్ ఎంట్రీ అదిరింది

OTT Bold: రొమాంటిక్, కిస్ సీన్లతో.. ఓటీటీకి తెలుగు బోల్డ్ సిరీస్.. మూడో గులాబీ గ్లామర్ ఎంట్రీ అదిరింది

దర్శకుడు మారుతి షో రన్నర్‌‌‌‌గా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై SKN నిర్మించిన ‘త్రీ రోజెస్’. అతి త్వరలో ఈ సీజన్ 2 ఆహాలో స్ట్రీమింగ్కి వస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

లేటెస్ట్గా 3 రోజెస్ నుంచి మూడో గులాబీ వచ్చేసింది అంటూ పోస్ట్ చేశారు. బ్యూటీ రాశి సింగ్ను పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ట్రెడిషనల్ నుంచి గ్లామర్ పాత్రలో రాశి సింగ్ ఎంట్రీ ఇచ్చి మత్తెక్కించింది. 

ముందు రాశి సింగ్‌ను చాలా చక్కటి అచ్చమైన తెలుగు అమ్మాయిలా చూపించారు. ఇలాంటి సాంప్రాదాయమైన గులాబీ త్రీ రోజెస్లో ఏలా అనేలా ఆశ్చర్యపరిచారు . ఆపై ఒక్కసారిగా తన పరిచయాన్నే మార్చేశారు. పబ్‌లో షాట్స్ కొడుతూ, కరాటే పోజులిస్తూ గ్లామర్‌గా ప్రజంట్ చేసి కుర్రాళ్ళ గుండెలకు ఫీల్ ఇచ్చారు.

దానికి తోడు AIని వాడుతూ.. 3 రోజెస్ సీజన్ 2లో కొత్త పాత్ర ఏంటని? చాట్ జీపీటీలో అడిగడం, అది ట్రెడిషనల్‌గా ఉన్న రాశి సింగ్‌ను చూపించడం ఆసక్తి రేపుతోంది. ఆ తర్వాత మరో టెక్నాలజీ గ్రోక్‌లో అడిగితే గ్లామర్‌గా ఉన్న రాశి సింగ్‌తో చూపించి ఆసక్తి పెంచారు. 'ఆమె కేవలం కొత్త గులాబీ కాదు, ఆమె ఒక అద్భుతమైన అందగత్తె.. క్లాసిక్ ఆకర్షణ. మోడరన్ థింకింగ్..  అన్ స్టాపబుల్ ఎనర్జీ.. ' అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. 

ఇప్పటికే, ఈ సిరీస్ లో మొదటి గులాబీగా హీరోయిన్ ఈషా రెబ్బా, రెండో గులాబీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ కుషిత కల్లపును పరిచయం చేశారు. వీరి పాత్రలకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేసి క్యూరియాసిటీ కలిగించారు. ఇటీవలే, కుషిత 39 సెకన్ల నిడివి ఉన్న తన క్యారెక్టర్‌‌‌‌ గ్లింప్స్‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాత్ర మరింత బోల్డ్గా ఉండబోతున్నట్లు ఈ వీడియో ద్వారా చూపించారు. 

“కొత్త రోజ్‌ను కలవండి. ఖుషితా కల్లాపు. ఈమె వయసు మీద పడిన మగాళ్లను ప్రేమిస్తుంది. ఈమె జీవితం గందరగోళం. ఈమే మీ స్పిరిట్ యానిమల్ కావచ్చు” అనే క్యాప్షన్తో మరింత ఆసక్తి రేపింది. 

ఈ బోల్డ్ కామెడీ వెబ్ సిరీస్లో ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రలు పోషించారు. అన్నీ కుదిరితే, 3 రోజెస్ రెండో సీజన్ మే సెకండ్ వీక్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

ఇకపోతే, 3 రోజెస్ సీజన్ 2 సిరీస్ను కిరణ్ K కరవల్ల డైరెక్ట్ చేయగా.. రవి నంబూరి, సందీప్ కథ అందించారు. అజయ్ అరసవాడ సంగీతం అందించారు. నవంబర్, 2021లో తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓటీటీ ఆడియన్స్ను ఆకట్టుకుంది.