
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు 10 మంది సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సి.హరికిరణ్, నల్గొండకు అనితా రామచంద్రన్, హైదరాబాద్ కు ఇలంబర్తి, ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్, నిజామాబాద్ కు రాజీవ్‌గాంధీ హనుమంతు, రంగారెడ్డికి దివ్య, కరీంనగర్ కు సర్ఫరాజ్ అహ్మద్, మహబూబ్ నగర్కు రవి, వరంగల్ కు కె.శశాంక, మెదక్ జిల్లాకు ఎ.శరత్ ను నియమించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి రిపోర్టులు ఇవ్వాలని వారిని ఆదేశిం చారు. అలాగే వర్షాలు, వరద పరిస్థితులను కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.