ముంబై : మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను తమ రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో యూపీఎస్ కు ఆమోదం లభించింది. దీంతో దేశంలో యూపీఎస్ ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ ఏడాది మార్చి నుంచే రాష్ట్రంలో యూపీఎస్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర కేబినెట్ వెల్లడించింది.
దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న సగటు బేసిక్ శాలరీలో 50 శాతం పెన్షన్‌గా పొందనున్నట్లు తెలిపింది. యూపీఎస్ తోపాటు అనేక ఇతర కార్యక్రమాలకు కూడా మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు కోతలు లేని పవర్ సప్లై స్కీమ్ ను పొడిగించాలని నిర్ణయించింది. రూ. 7 వేల కోట్లతో నదుల అనుసంధాన ప్రాజెక్ట్రూ
.6,049 కోట్లతో థానేలో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. 10 వేల కోట్లతో మెడిసిటీ, మాంగ్రోవ్ పార్క్, కెమికల్ హబ్, డిజిటల్ యూనివర్శిటీ వంటి ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆశా ఫెసిలిటేటర్ల వేతనాలను రూ. 4 వేలకు పెంచాలని నిర్ణయించింది.